KTR: డీలిమిటేషన్‌కు మేము వ్యతిరేకం.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
డీలిమిటేషన్ (Delimitation) విధానంపై చెన్నై (Chennai) వేదికగా జరుగుతోన్న అఖిలపక్ష సమావేశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: డీలిమిటేషన్ (Delimitation) విధానంపై చెన్నై (Chennai) వేదికగా జరుగుతోన్న అఖిలపక్ష సమావేశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), పీసీపీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ (KTR, మాజీ ఎంపీ వినోద్ (Vinod) పాల్గొనబోతున్నారు. సీఎం స్టాలిన్ (CM Stalin) అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఐటీసీ చోళ (ITC Chola) హోటల్‌లో అఖిలపక్ష భేటీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. డీమిలిటేషన్ (Delimitation)కు తాము పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్‌తో తీరని అన్యాయం జరగబోతోందని అన్నారు.
ఇప్పడే రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం (BJP Government) ఉంటేనే కేంద్రం (Central Government) నిధులు ఇస్తామంటోందని.. డీమిలిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల మాటకు ఏమాత్రం విలువ లేకుండాపోయే ప్రమాదం ఉందన్నారు. డీలిమిటేషన్‌తో ఎలాంటి అన్యాయం జరగదని.. మాటల్లో బీజేపీ (BJP) నేతలు చెప్పడం కాదని, దానికి ఒక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో 2.8 శాతం జనాభా ఉన్న తెలంగాణ (Telangana), దేశ జీడీపీ (GDP)లో 5.1 శాతం కాంట్రీబ్యూట్ చేస్తోందని అన్నారు. ఒకవేళ డీలిమిటేషన్‌తో ఎంపీ స్థానాలు తగ్గితే.. పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల వాయిస్ తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్నటి టాక్స్‌ల పేరుతో తెలంగాణ నుంచి రూపాయి తీసుకుని.. 25 పైసలు మాత్రమే చెల్లిస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్‌తో నిధుల పరంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర వివక్షకు గురయ్యే ప్రమాదం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.