నగరంలో కృతజ్ఞతా మార్చ్ : మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు

బీసీలకు 42 శాతం రిజ్వర్వేషన్, ఎస్సీ వర్గీకరణ, రాజీవ్ యువ వికాసం వంటి నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ.. హైదరాబాద్ యూత్‌ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం కృతజ్ఞత మార్చ్‌ నిర్వహించారు.

Update: 2025-03-23 17:06 GMT
నగరంలో కృతజ్ఞతా మార్చ్  : మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలకు 42 శాతం రిజ్వర్వేషన్, ఎస్సీ వర్గీకరణ, రాజీవ్ యువ వికాసం వంటి నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ.. హైదరాబాద్ యూత్‌ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం కృతజ్ఞత మార్చ్‌ నిర్వహించారు. సచివాలయం వద్దనున్న రాజీవ్‌ గాంధీ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీ చెపట్టారు. ఇందిరా పార్కు వద్ద థ్యాంక్యూ రేవంత్‌ అన్నా అని ప్రచురించిన 40 అడుగుల ప్లెక్సీని డ్రోన్ల సహాయంతో ఎగరేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేయించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని, అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి 42 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారని తెలిపారు. రాజీవ్‌ యువ వికాసం పేరుతో రూ. 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయమందించి స్వయం ఉపాధి కల్పన దిశగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

ప్రతిపక్షాలు సీఎంని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. గతంలో బీఆర్‌ఎస్ రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఎంత అని ప్రశ్నించారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పేందుకు యావత్‌ తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ గాంధేయ సిద్ధాంతాలను పాటిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఇదే తరహాలో డబ్బులిచ్చి తమను తిట్టించే ప్రయత్నం చేస్తే మీకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News