TG Assembly: చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు.. చర్చకు వచ్చే అంశాలివే!

చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Update: 2025-03-27 03:33 GMT
TG Assembly: చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు.. చర్చకు వచ్చే అంశాలివే!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీతో పాటు శాసన మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) అనుమతితో ప్రశ్నోత్తరాలకు ముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సభలో కాగ్ (Comptroller and Auditor General of India) రిపోర్టును ప్రవేశ పెట్టనున్నారు. ఆ రిపోర్టుపై చర్చ ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకురాబోతున్న లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ (Delimitation)పై వ్యతిరేకంగా అసెంబ్లీ (Assembly)లో తీర్మానం ప్రవేశపట్టనున్నారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లు (Currency Exchange Bill), అవయవ దానం బిల్లు (Organ Donation Bill)లకు కూడా ఆమోదం తెలపనున్నారు.

అయితే, 11వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Sessions) భాగంగా కేటీఆర్ (KTR) చేసిన 30 శాతం కమీషన్లు అంటూ చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS)సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అంనంతరం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ కేవలం అభివృద్ధి, సంక్షేమం‌పైనే ఫోకస్ పెట్టిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ అడుగడుగునా అడ్డు పడుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందిని మండిపడ్డారు. అదేవిధంగా ఆయన గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం 2021‌లో ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై నిషేధం విధించినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటీవల రాష్ట్రంలో పలు ఘటనలు చోటు‌చేసుకున్నాయని కామెంట్ చేశారు. ఆన్‌లైన్ రమ్మీ, బెట్టింగ్స్ యాప్స్‌ను సమూలంగా నిషేధించేందుకు స్పేషల్ ఇన్వెష్టిగేషన్ టీమ్‌ (Special Investigation Team)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా సభలో ప్రకటించారు. 

Tags:    

Similar News