కేరళలో రాష్ట్ర పిఎస్సీల చైర్‌పర్సన్‌ల జాతీయ సమావేశం

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో రెండు జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.

Update: 2025-03-23 16:55 GMT
కేరళలో రాష్ట్ర పిఎస్సీల చైర్‌పర్సన్‌ల జాతీయ సమావేశం
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో రెండు జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మార్చి 22, 23 తేదీలలో తిరువనంతపురంలో కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన నేషనల్ వర్క్‌షాప్ ఆన్ టెక్నాలజీలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ ఎన్. యాదయ్య, పి. రజిని కుమారి పాల్గోన్నారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ జూన్‌లో లీగల్ ఛాలెంజేస్ వర్క్‌షాప్, డిసెంబర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ద్వారా దేశవ్యాప్తంగా పబ్లీక్ సర్వీస్ కమిషన్ లను రూపొందించే చర్చలలో మార్గదర్శకాలను తెలుపుతుందని అన్నారు.

టీజీపీఎస్సీకి సబంధించిన లీగల్ ఛాలెంజెస్ పై నల్సార్ పర్యవేక్షణలో సమగ్ర వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19 రాష్ట్రాలకు చెందిన 60 పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల (పీఎస్సీ) చైర్‌పర్సన్‌లు నేషనల్ వర్క్‌షాప్ ఆన్ టెక్నాలజీలో పాల్గొన్నారని తెలిపారు. పీఎస్సీల నియామక ప్రక్రియలలో అడ్వాన్సడ్ టెక్నాలజీతో పరిష్కారాల ఏకీకరణ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), బయోమెట్రిక్ అథన్టీకేషన్, ఆఫీస్ ఆటోమేషన్, డిజిటల్ వాల్యూయేషన్ అంశాలపై మెరుగైనా విధి విధానాల పై చర్చించడం జరిగిందిని బుర్రా వెంకటేశం తెలిపారు.

Tags:    

Similar News