కలెక్టర్ మాట పట్టించుకోని కాంట్రాక్టర్.. ఇంతకీ విషయం ఏంటో తెలుసా..?
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మండలంలోని బండమీది చందుపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జనవరి 23 వ తారీఖున ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

దిశ ,చివ్వేంల: సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మండలంలోని బండమీది చందుపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జనవరి 23 వ తారీఖున ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించి వారం రోజులలో పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారుల చెప్పడం జరిగింది. కలెక్టర్ పాఠశాలను సందర్శించి రెండు నెలలు కావస్తున్న పాఠశాలలోని పనులు పూర్తి కాకపోవడం పట్ల పలువురు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులలో పనులు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకుంటానని స్వయంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చెప్పిన పనులు పూర్తి చేయకపోవడం పట్ల కాంట్రాక్టర్ ధీమా ఏమిటో ఎవరికి అంతుచిక్కడం లేదు.
జిల్లా కలెక్టర్ చెప్పిన కూడా ఆయన మాటను పట్టించుకోకుండా పనులు పూర్తి చేయకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మండల విద్యాశాఖ అధికారులు , పాఠశాలలో కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేదని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లారా లేక కాంట్రాక్టర్ తో అధికారులు కుమ్మక్కై విషయాన్ని కలెక్టర్ గారికి తెలియకుండా దాచి పెట్టారా అనేది అంతు చిక్కని ప్రశ్న. కలెక్టర్ పాఠశాలను సందర్శించిన వేళ అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పైన ఆగ్రహం వ్యక్తం చేసి.. వారం రోజుల్లో పని పూర్తి చేయకపోతే సంబంధిత అన్ని శాఖల అధికారుల పైన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ చెప్పారు. సుమారు రెండు నెలలు అవుతున్న పనులు పూర్తి కాకపోవడం పట్ల కలెక్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.