MLA Jagdish Reddy : తిరుమలగిరి దాడి ఘటన దురదృష్టకరం
రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్
దిశ,సూర్యాపేట : రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు స్పష్టత లేదని మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు.ఈ మాఫీపై స్వయానా ఆ ప్రభుత్వ మంత్రులే పూర్తి స్థాయిలో మాఫీ కాలేదని చెబుతున్నా ప్రభుత్వ యంత్రాంగం కవరింగ్ చేస్తుందని ఎద్దేవా చేశారు.రైతు రుణమాఫీ పై బిఆర్ఎస్ అది నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ వద్ద ఏర్పాటు చేసిన దర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయినందున వాటిని కప్పిపుచ్చు కునేందుకే ప్రత్యక్ష దాడులకు పూనుకుంటోందని ఆరోపించారు.కాంగ్రెస్ మోసాలు బయట పడకుండా ఉండేందుకు ఇటువంటి హింసను ప్రేరేపిస్తున్నట్లు చెప్పారు. అందుకు రాష్ట్రంలో అల్లర్లు జరిగాలని సీఎం రేవంత్ డైరెక్షన్ చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు.
శాంతియుతంగా ధర్నా చేస్తున్న తిరుమలగిరి బిఆర్ఎస్ శిబిరంపై కాంగ్రెస్ దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.పోలీసుల సమక్షంలోనే ఆ శిబిరాన్ని కూల్చివేశారని, కాంగ్రెసుతో కలిసి పోలీసులు పని చేస్తిన్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంగా ప్రజలకిచ్చిన హామీల కోసం ప్రభుత్వంపై ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైవి,గండూరి ప్రకాష్,జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్,పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సవరాల సత్యనారాయణ,బూర బాల సైదులు,నెమ్మది భిక్షం,జీడి భిక్షం, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్,తాహెర్, కెక్కిరేణి నాగయ్య,సుంకరి రమేష్, మోత్కూరి సందీప్, తదితరులు పాల్గొన్నారు.