ఆలేరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి..
దిశ, బొమ్మలరామారం: ఆలేరు గడ్డపై కాంగ్రెస్ జెండా ను ఎగురవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్
దిశ, బొమ్మలరామారం: ఆలేరు గడ్డపై కాంగ్రెస్ జెండా ను ఎగురవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య అన్నారు. శనివారం యాదగిరిగుట్ట లోని ఆయన నివాసంలో మండలంలోని లక్ష్మీ తండా, తిరుమలగిరి, కంచల్ తండా, మైలారం గ్రామాలకు చెందిన పలు పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలసికట్టుగా పని చేసి కేంద్రం, రాష్ట్రంతోపాటు ఆలేరు నియోజకవర్గలోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేసే దిశగా పని చేద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని, పేద ప్రజలకు సరైన న్యాయం దక్కుతుందన్నారు. పార్టీ బలోపేతానికి మద్దతుగా వస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బీర్ల అయిలయ్య ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలకు ఆకర్షితులై మండలంలోని పలు గ్రామాల నాయకులు భారీగా పార్టీలో చేరుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యేగా బీర్ల అయిలయ్యను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పార్టీలో చేరిన వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో చేరిన వారిలో ఆయా గ్రామాల నాయకులు మోహన్, రమేష్, లక్ష్మణ్, రాజేంద్ర, పాపా, సచిన్, కృష్ణ, నవీన్, సిద్ధు, సాయి గణేష్, అనిల్, అరుణ్, శివ, ఆకాష్ తదితరులు ఉన్నారు.
Also Read : రాహుల్ గాంధీని బలవంతం చేస్తాం: Mallikarjun Kharge