నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచిన జాలే నరసింహారెడ్డి..
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుపేద విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ కోసం ఆర్థిక సహయం చేయాలని నందు అకాడమీ చైర్మన్ నందులాల్ మంగళవారం హైదరాబాదులో టీపీసీసీ మెంబర్, చందంపేట మండలం చిత్రియాల పీఎసీఎస్ చైర్మన్ నరసింహారెడ్డిని కలిశారు.
దిశ, దేవరకొండ /చందంపేట: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుపేద విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ కోసం ఆర్థిక సహయం చేయాలని నందు అకాడమీ చైర్మన్ నందులాల్ మంగళవారం హైదరాబాదులో టీపీసీసీ మెంబర్, చందంపేట మండలం చిత్రియాల పీఎసీఎస్ చైర్మన్ నరసింహారెడ్డిని కలిశారు. వెంటనే స్పందిచిన నరసింహారెడ్డి అభ్యర్థులకు తన వంతుగా రూ.50 వేలు ఆర్థిక సహయం చేశారు. ఈ సందర్భంగా జాలే నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు కష్టపడి చదవాలని.. రోజువారి పనుల్లో కఠోరమైన శ్రమతో కూడిన సాధన చేసినట్లు అయితే ఉద్యోగాలు తప్పక వస్తాయని అన్నారు. అంతేకాకుండా ఇక ముందు ఎలాంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని అకాడమీ చైర్మన్‌ను కోరారు. రూ. 50 వేలు సహయం చేయడంతో అకాడమీ చైర్మన్ నందులాల్, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఆయనను అభినందించారు.