కర్ణాటక నుంచి 15 టీఎంసీల నీటిని ప్రభుత్వం తీసుకురావాలి : గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన

Update: 2024-02-27 13:45 GMT

దిశ,నల్లగొండ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన నివాసంలో మాట్లాడుతూ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా మంచి వర్షపాతం అలాగే చెరువులు, నదులు నీళ్లతో నిండు కుండాల ఉండేవి నేడు సాగర్ ఆయకట్టు కింద నీరు లేక బోర్ల ద్వారా సేద్యం చేసుకునే పరిస్థితి బోర్లు కూడా ఎండిపోయాయి. పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఎన్ని బోర్లు వేసినా గ్రౌండ్ వాటర్ లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు 15 టీఎంసీల నీరు కర్ణాటక నుంచి తీసుకువచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని అన్నారు. మార్చి తర్వాత తీవ్రమైన మంచినీటి ఇద్దరి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఎన్నికల హడావుడి లో ఉండడం వల్ల రైతుల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మంచినీటి సమస్య అప్పటికప్పుడు పరిష్కారం చేయలేము ఇప్పటినుండి పరిష్కారం చేసే దిశగా అడుగులు వేయాలని తెలిపారు.

ఎండుతున్న పంటలను కాపాడుకోవాలని 400 పార్లమెంట్ సీట్లతో బీజేపీ అధికారులకు వస్తుందని వారి ప్రచారం వారే చేసుకుంటున్నారు ఏది ఏమైనా అధికారం కోల్పోయిన టిఆర్ఎస్ పార్టీ కలిసికట్టుగా పనిచేసే గెలిచిన ఓడిన గౌరవప్రదంగా పనిచేయాలి. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిన పార్టీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఓటమి తర్వాత సమీక్ష చేసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు సమీక్ష చేసుకోవాలని మనం కూడా పొరపాటున సరిదిద్దుకోవాలని అన్నారు.పార్టీ నిర్ణయం అందరూ కలిసి పనిచేయాలని పట్టుదల ఎవరు పోటీ ఇవ్వగలరు. ఎవరి సరియైన అభివృద్ధి అనేది టిఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తించాలన్నారు. ప్రజల్లో ఒక వేవ్ వచ్చింది దానివల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఆలోచన చేయాలని నష్టపోయేది మనమే అని అందరం కూడా కలిసి కూర్చుని మాట్లాడుకుని గెలిపించుకోవాలని అన్నారు.


Similar News