స్వాతంత్య్ర సమరయోధుడు గుంటకండ్ల పిచ్చిరెడ్డి ఇకలేరు

స్వాతంత్య్ర సమర యోధుడు, సీపీఐ సీనియర్ నాయకుడు గుంటకండ్ల పిచ్చిరెడ్డి ఇవాళ మృతి చెందారు.

Update: 2022-11-26 13:10 GMT

దిశ, నాగారం: స్వాతంత్య్ర సమర యోధుడు, సీపీఐ సీనియర్ నాయకుడు గుంటకండ్ల పిచ్చిరెడ్డి(98) అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇవాళ మృతి చెందారు. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా నాగారం. ఆయనకు భార్య, నలుగురు సంతానం. గుంటకండ్ల పిచ్చిరెడ్డి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డికి స్వయానా పెదనాన్న. ఐజేయూ జనరల్ సెక్రెటరీ కట్ట శ్రీనివాస్ రెడ్డికి మేనమామ. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన ఆగ్ర నాయకులలో పిచ్చిరెడ్డి ఒకరు. నాగారం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీచేసిన పిచ్చిరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి రంగారెడ్డి చేతిలో స్వల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారు. నాగారం నియోజకవర్గం రద్దయిన తర్వాత ఏర్పడిన నాగారం సమితి ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. నాగారం గ్రామ సర్పంచ్ గా 35 సంవత్సరాలకు పైగా పని చేశారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విలువలతో కూడిన నాయకుడిని కోల్పోయామని, ఆయన లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.  

Tags:    

Similar News