MLA mandula Samel : నాడు రాజయ్యను తొలగించింది ఎందుకు..?

మాదిగల పట్ల ప్రేమే ఉంటే ఆనాడు మంత్రి వర్గం నుండి ఉపముఖ్యమంత్రి రాజయ్యను ఎందుకు తొలగించారని..? దీనికి సమాధానం లేదని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు.

Update: 2024-08-01 10:24 GMT

దిశ, తుంగతుర్తి : మాదిగల పట్ల ప్రేమే ఉంటే ఆనాడు మంత్రి వర్గం నుండి ఉపముఖ్యమంత్రి రాజయ్యను ఎందుకు తొలగించారని..? దీనికి సమాధానం లేదని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. మాదిగలకు మూడెకరాల భూమి లేదన్నారు. ఆ పార్టీకి మాదిగలు అంటే ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు. మాదిగ ఉద్యమకారులను ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పై గురువారం శాసనసభలో సామెల్ మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణలో సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు ఒక చారిత్రాత్మకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే ఇది సాధ్యం పడిందన్నారు. దీనికోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో అనేక మంది అమరులయ్యారని పేర్కొంటూ జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా కేంద్రం, సుప్రీంకోర్టులకు ధన్యవాదములు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే ఢిల్లీకి వెళ్ళామని తెలిపారు. ముఖ్యంగా కష్ట జీవులైన మాదిగలు గ్రామాల్లో దూరంగా వెలివేయబడే రీతిలో ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి మాదిగలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని పేర్కొన్నారు.

Tags:    

Similar News