24గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని.. విద్యుత్ డీఈ కార్యాలయం ముట్టడి
రైతులకు 24గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ.. మంగళవారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ డీఈ కార్యాలయం ముట్టడి చేశారు..
దిశ, మిర్యాలగూడ: రైతులకు 24గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ.. మంగళవారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ డీఈ కార్యాలయం ముట్టడి చేశారు. అనంతరం రోడ్డు పై బైటాయించి మాట్లాడారు. విద్యుత్ కోతలతో వరి పొలాలకు సాగు నీరు అందడం లేదని, మోటర్ల సాయంతో నీటి సరఫరా చేస్తున్న పొలాలు ఎండి పోతున్నాయని పేర్కొన్నారు.
24గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పిన ప్రభుత్వం 12 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. దీంతో పొట్ట దశలో ఉన్న పొలాలు ఎండి పోతున్నాయన్నారు. 24 గంటల విద్యుత్ ఇచ్చి నీటి విడుదలలో వారబంది తొలగించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.