రాష్ట్ర విభజన హామీలను కేంద్రం అమలు చేయాలి : ఎండీ జహంగీర్
రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్ డిమాండ్ చేశారు.
దిశ,చౌటుప్పల్ : రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్ డిమాండ్ చేశారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఈడి, ఐటీ దాడులను నిర్వహిస్తుందని విమర్శించారు. ఈ దాడుల పేరుతో తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర కేంద్ర ప్రభుత్వం పన్నుతున్నదని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ డొల్లతనం బయటపడిందనే కక్షతోనే ఈడి, ఐటీ దాడులు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి. పాషా,మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్,దండా అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.