బీజేపీ చర్యలు కక్షపూరితం : గుత్తా సుఖేందర్ రెడ్డి

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దుయ్యబట్టారు.

Update: 2022-11-25 14:31 GMT

దిశ, నల్లగొండ : అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ కుట్రలు చేస్తూ తెలంగాణలో అధికారంలోకి రావాలని కుయుక్తులు చేస్తోందని అన్నారు. వ్యక్తిగత దాడులు చేస్తున్న బీజేపీ పోకడలు మానుకోవాలని సూచించారు. లిస్ట్ తయారీ చేసి మరి బీజేపీ ఇతర నేతలపై ఈడీ, ఐటీ దాడులు చేయించడం హేయమైన చర్య అని అన్నారు. కేంద్రం అవలంభిస్తున్న చర్యలతో దేశంలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని ఆవేదన చెందారు. బీజేపీ చేస్తున్న చర్యలతో రాజకీయాలంటేనే ప్రజలు ఈసడిచుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ కు రావాల్సిన నిధుల్లో కోత పెట్టి, కేంద్రం ఫెడరల్ వ్యవస్థ కు విఘాతం కలిగిస్తోందని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం బీజేపీకి తగదని, సంక్షేమ పథకాలను అడ్డుకుంటూ ఓట్లు అడగటం హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News