అయ్య బాబోయ్​...22 అడుగులు

మండల కేంద్రంలో అరుదైన నాటు జొన్న మొక్క చూపరులను ఆకర్షిస్తుంది. ఎత్తుగా పెరిగిన ఆ మొక్కను చూడడానికి గ్రామస్తులు బారులు తీరుతున్నారు.

Update: 2022-11-25 14:21 GMT

దిశ, తిరుమలగిరి (సాగర్) : మండల కేంద్రంలో అరుదైన నాటు జొన్న మొక్క చూపరులను ఆకర్షిస్తుంది. ఎత్తుగా పెరిగిన ఆ మొక్కను చూడడానికి గ్రామస్తులు బారులు తీరుతున్నారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ నాగేండ్ల పంచ కృష్ణారెడ్డి తన ఇంటి ఆవరణలో నాటు జొన్న మొక్కను ఐదు నెలల క్రితం నాటాడు. అది ప్రస్తుతం 22 అడుగుల మేరకు ఏపుగా పెరిగి చూపరులను ఆకర్షిస్తుంది. నాటు జొన్న మొక్క ఇంత ఎత్తు పెరగడం అరుదని ఆయన తెలిపాడు. తన ఇంటి ఆవరణలో మామూలు మొక్కల పెంపకం తో పాటు అరుదైన మొక్కలను పెంచుతున్నట్టు ఆయన చెప్పారు.  

Tags:    

Similar News