మద్యం సేవించి విధులకు హాజరైన ఉద్యోగి.. తోటి ఉద్యోగులపై అసభ్యకర ప్రవర్తన

ఒక ప్రభుత్వ కార్యాలయంలో సూపరింటెండెంట్ స్థాయిలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి..

Update: 2023-02-14 09:32 GMT

దిశ,సూర్యా పేట ప్రతినిధి: ఒక ప్రభుత్వ కార్యాలయంలో సూపరింటెండెంట్ స్థాయిలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి. తన స్థాయిని మరిచి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. ఈ విషయం బయటికి రావడంతో విద్యార్థి సంఘాలు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

మద్యం సేవించి విధులకు హాజరైన సూపర్ డెంట్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అధికారి మద్యం సేవించి విధులకు హాజరు కావడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఒక అధికారి మంగళవారం మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. తోటి ఉద్యోగస్తులతో అసభ్యకరంగా వ్యవహరించడం కార్యాలయంలో తోటీ ఉద్యోగస్తులతో మద్యం మత్తులో దురుసుగా మాట్లాడడంతో విషయం బయటకు వచ్చింది.

ఇది కాస్త విద్యార్థి సంఘాలకు నాయకుల దృష్టికి పోవడంతో వారు విద్యాశాఖ కార్యాలయం చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగస్తుడై ఉండి మద్యం తాగి విధులకు ఏ రకంగా హాజరవుతాడని విద్యార్థి సంఘాలు విద్యాశాఖ అధికారిని నిలదీశారు. మద్యం సేవించిన సదరు అధికారిపై చర్యలు తీసుకుని కార్యాలయంలోని ఇతర ఉద్యోగస్తులకు భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం విద్యాశాఖ అధికారికి వినతీపత్రం అందజేశారు. విద్యార్థి సంఘాల నాయకులు వెంటనే కార్యాలయానికి చేరుకోవడంతో అది గమనించిన సదరు అధికారి కార్యాలయం నుంచి వెళ్లిపోవడం విశేషం. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News