ములుగుకు వరాలు... మంత్రి సీతక్క ధన్యవాదాలు

ములుగు మెడికల్ కాలేజీకి 433 పోస్టుల మంజూరు చేయడంతో పాటు ఏటూరు నాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ..

Update: 2024-09-20 15:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ములుగు మెడికల్ కాలేజీకి 433 పోస్టుల మంజూరు చేయడంతో పాటు ఏటూరు నాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో నాగారం ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చారంటూ క్యాబినెట్ సహచరులకు మంత్రి సీతక్క థ్యాంక్స్ చెప్పారు. ఏటూరు నాగారం ఫైర్ స్టేషన్ ఏర్పాటుతో పాటు 35 మంది సిబ్బందిని మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతం అయిన ఏటూరు నాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అయితే ఎన్నో అగ్ని ప్రమాదాలను నివారించగలుగుతామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.


Similar News