ఉద్యోగ భద్రత కల్పించాలి: గెస్ట్ లెక్చరర్ల డిమాండ్

ఉద్యోగ భద్రత కల్పించాలని, నియామకంతో సంబంధం లేకుండా తమను ఆదుకోవాలని గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.

Update: 2024-09-20 16:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 1392 రెగ్యులర్ లెక్చరర్ల నియామకంతో సంబంధం లేకుండా గెస్ట్ లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం గెస్ట్ లెక్చరర్లు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన 1219 జీవోలో తీసివేసిన పోస్టులను యథావిధిగా కంటిన్యూ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం జోనల్ వైజ్‌గా ఉన్న ఖాళీలతో పాటు గతంలో, ప్రస్తుతం బదిలీలు, ఇతర కారణాల వల్ల డిస్టర్బ్ అయిన లెక్చరర్లను వారి గత అనుభవం ప్రకారం అడ్జస్ట్ మెంట్ చేయాలని సర్కార్‌ను కోరారు. వొకేషనల్ సెకండ్ పోస్ట్ కారణంతో తీసేసిన పోస్టులను కొనసాగించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1654 పోస్టులు కాకుండా అదనంగా పోస్టులు మంజూరు చేయాలని, నూతనంగా మంజూరు చేసిన కాలేజీల్లో నాన్ శాంక్షన్డ్ పోస్టులు మంజూరు చేయాలన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గెస్ట్ లెక్చరర్లతో పెద్దఎత్తున సమావేశం నిర్వహించాలని వారు తీర్మానం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కోడి మహేష్ కుమార్, ఉపాధ్యక్షులు బాబురావు, శ్రీకాంత్, కోశాధికారి బండి. కృష్ణ, అధికార ప్రతినిధులు ప్రసాద్, వెంకటేష్, పరమేష్, రాష్ట్ర నాయకులు నాగరాజు, కమలాకర్, చిరంజీవి, గార్గేయి, శివలీల, మమత, ఇస్సాక్, యాదయ్య, మస్తాన్, బ్రహ్మయ్య, శ్రీధర్, అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News