Breaking: హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది...

Update: 2024-09-20 16:46 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, కృష్ణానగర్, మాదాపూర్, బేగంపేట్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, తార్నాక, నాగోల్, బోడుప్పల్, తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పలుచోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో బస్తీలు, కాలనీల్లోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు జీహెచ్ ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అత్యవసరమైతేనే రావాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉందని, చెట్ల కిందకు  ఎవరూ వెళ్లొద్దన్నారు.  వర్షాలు ఆగిపోయే వరకూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.


Similar News