‘వారిని ఊహాలోకంలో ఉంచండి.. మీరు ఫామ్‌హౌజ్‌లో ఉండండి’.. కేసీఆర్‌కు సీతక్క కౌంటర్
బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR)కు మంత్రి సీతక్క(Minister Seethakka) కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR)కు మంత్రి సీతక్క(Minister Seethakka) కౌంటర్ ఇచ్చారు. ‘బీఆర్ఎస్ కార్యకర్తలను ఊహాలోకంలో ఉంచండి.. మీరు ఫామ్‌హౌజ్‌లో ఉండండి’ అని సీతక్క సెటైర్ వేశారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కల అని.. మీరు అవే కలలు కనుకుంటూ ఉండండి అని సూచించారు. తాము విమర్శలు పట్టించుకునే పరిస్థితుల్లో లేమని.. ప్రజలకు మంచి పాలన అందించేందుకు ట్రై చేస్తున్నామని అన్నారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. బీఆర్ఎస్ నేతలు చేసిన నిర్వాకం అంతా ఇంతా కాదని అన్నారు. ఎన్ని అక్రమాలు చేయాలో అన్నీ చేశారని ఆరోపించారు.
కాగా.. అంతకుముందు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్(KCR Farmhouse)లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. అది కూడా సింగిల్‌గానే అధికారంలో వస్తామని జోస్యం చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ సమస్యలు మొదలు అయ్యాయని అన్నారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.