‘ఇంటింటికీ తిరగండి’.. హెల్త్ స్టాఫ్‌కు మంత్రి దామోదర రాజనర్సింహా కీలక ఆదేశం

సీజనల్ వ్యాధులను కంట్రోల్ చేసేందుకు ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేయాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఆదేశాలిచ్చారు. దగ్గు, జలుబు, వైరల్​ఫీవర్ బాధితులను గుర్తించాలని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో హెల్త్ స్టాఫ్‌కు సూచించారు.

Update: 2024-07-23 15:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీజనల్ వ్యాధులను కంట్రోల్ చేసేందుకు ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేయాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఆదేశాలిచ్చారు. దగ్గు, జలుబు, వైరల్​ఫీవర్ బాధితులను గుర్తించాలని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో హెల్త్ స్టాఫ్‌కు సూచించారు. అందుకు తగిన మెడికేషన్ ఇవ్వాలన్నారు. మలేరియా, డెంగీ బాధితులపై సీరియస్‌గా ఫోకస్ పెట్టాలన్నారు. అనుమానితులను గుర్తించి, వెంటనే వైద్య పరీక్షలకు పంపాలన్నారు. వైరల్ ఫీవర్ నివారణకు అవసరమైన మందులను ఇంటింటికి తిరిగి ఇవ్వాలన్నారు. జ్వర సర్వే చేసి ప్రతీ రోజూ వైద్య ఆరోగ్యశాఖకు నివేదిక పంపించాలని అన్ని జిల్లాల డీఎమ్హెచ్వోలకు సూచించారు. జిల్లాల వారీగా నమోదయ్యే కేసుల వివరాలు స్పష్టంగా ఉండాలన్నారు. డెంగీ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్‌, శ్వాసకోశ సంబంధిత, స్వైన్‌ఫ్లూ వ్యాధులను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.


Similar News