పోచారం మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం..

పోచారం మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం పచ్చని మొక్కల పాలిట

Update: 2024-06-11 10:46 GMT

దిశ, ఘట్కేసర్ : పోచారం మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం పచ్చని మొక్కల పాలిట శాపంగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డులోని ఏర్పాటుచేసిన పట్టణ నర్సరీలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మొక్కలన్ని ఏపుగా చెట్లుగా ఎదిగాయి. ఈ విషయంపై గత నెల 28న "పట్టణ నర్సరీల పై పర్యవేక్షణేది" శీర్షికన దిశలో వచ్చిన కథనానికి ఎలా స్పందించాలో తెలియని అధికారులు పట్టణ నర్సరీలోని మొక్కలన్నీ నరికేసి జేసీబీ తో తొక్కించే సి కుప్పలుగా చేశారు. మొక్కల పెంపకం, పర్యవేక్షణ విషయంలో అధికారులు , మున్సిపల్ సిబ్బంది అధికారుల తీరుపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రకటన చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు గాంధీనగర్ పట్టణ నర్సరీ నిర్వహణ విషయంలో అభాసు పాలైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోసారి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. పటని నర్సరీ నిర్వహణలో అజాగ్రత్త వహించిన సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Similar News