సీఎంఆర్ కాలేజీ వివాదంలో కీలక అప్ డెట్.. హాస్టల్ వార్డెన్ ప్రీతి రెడ్డి అరెస్ట్

మహిళా విద్యార్థుల బాత్ రూమ్ కిటికీల నుంచి గుర్తు తెలియని దుండగులు వీడియోలు తీశారనే ఆరోపణలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.

Update: 2025-01-02 13:37 GMT

దిశ, వెబ్ డెస్క్: మహిళా విద్యార్థుల బాత్ రూమ్ కిటికీల నుంచి గుర్తు తెలియని దుండగులు వీడియోలు తీశారనే ఆరోపణలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. కాగా ఈ ఘటన ప్రముఖ సీఎంఆర్ కాలేజీ(CMR College)లో చోటు చేసుకోవడంతో.. అందరి దృష్టి ఈ వివాదంపై ఉంది. అయితే ఎవరో వీడియోలు(Videos) తీసినట్లు ఆనవాళ్లు కనిపించడంతో విద్యార్థినులు బుధవారం రాత్రి పెద్ద ఎత్తున నిరసనలు(protests) తెలిపారు. ఈ క్రమంలోనే ఏబీవీపీ(ABVP), ఎస్ఎఫ్ఐ(SFI) విద్యార్థి సంఘాలు(Student Unions) విద్యార్థులకు మద్దతుగా నిలవడంతో నిన్న రాత్రి.. సీఎంఆర్ కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన కాలేజీ యాజమాన్యం(College Proprietorship) ఓ ఎంక్వైరీ కమిషన్ (Inquiry Commission) వేసినట్లు పోలీసులకు తెలిపింది. కానీ విద్యార్థుల ఎంతకు తగ్గకపోవడం, వార్డెన్ ప్రీతి రెడ్డి(Warden Preeti Reddy) పై అనుమానం తో పాటు ఆరోపణలు చేయడంతో.. గురువారం సాయంత్రం.. ఆమెను అరెస్ట్(arrest) చేశారు. అలాగే బాలికల హాస్టల్ బాత్ రూమ్ పక్కే వంట సిబ్బంది రూమ్ ఉండటంతో.. వాళ్లే వీడియోలు తీసి ఉంటారని విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు ఈ కోణంలో కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.


Similar News