CMR కళాశాల ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
మేడ్చల్ జిల్లా కండ్లకోయ CMR ఇంజినీరింగ్ కాలేజీ(CMR Engineering College) ఘటన రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా కండ్లకోయ CMR ఇంజినీరింగ్ కాలేజీ(CMR Engineering College) ఘటన రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. కాలేజీ బాత్ రూంలో సెల్ ఫోన్‌తో వీడియోలు తీసిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలంటూ గత రాత్రి నుంచి విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. తమకు హాస్టల్‌లో తమకు భద్రత కరువైందంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా.. ఈ ఘటనపై మహిళా కమిషన్(Women's Commission) సీరియస్ అయింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. కాలేజీ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని సైబరాబాద్ కమిషనర్( Cyberabad Police Commissioner)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులైన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థినుల బాత్‌రూం పక్కనే పనివాళ్ల గది ఉండటం అనుమానాలకు తావిస్తోందని పోలీసులు చెబుతున్నారు.