ప్రతి డివిజన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా
రామగుండం కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ ను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు.
దిశ, గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ ను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. గురువారం గోదావరిఖని సప్తగిరి కాలనీలో ఎమ్మెల్యే, కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ & అదనపు కలెక్టర్ అరుణశ్రీ తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సప్తగిరి కాలనీలో రూ.కోటి 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రూ. కోటి 30 లక్షలతో ఓపెన్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తీవ్రమైన వానలు వస్తే ఈ ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందులు పడేవారని, ఇక సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. డివిజన్ లో కనీస సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీటి సౌకర్యాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
అక్కడి ప్రజలను ఆత్మీయంగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్థానిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనలు, సలహాలతో ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధిలోకి తీసుకువస్తామని అన్నారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కోట్లాది రూపాయల నిధులు తెప్పించి ఈ ప్రాంతాన్ని సుందరీకరణగా చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలు ఉన్నారు.