టీజీవోస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ గెజిటెట్ అధికారుల అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు ఆవిష్కరించారు.

Update: 2025-01-03 15:52 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : తెలంగాణ గెజిటెట్ అధికారుల అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు ఆవిష్కరించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో క్యాలెండర్ ను ఆవిష్కరించిన కలెక్టర్ అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అధికారులు విధి నిర్వహణలో సమర్దవంతంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షులు వినోద్ కుమార్ తోపాటు అసోసియేషన్ నాయకులు సాంబశివరావు,సైదులు, తదితరులు పాల్గొన్నారు. 


Similar News