దివ్యంగుల సంక్షేమానికి లూయిస్ బ్రెయిలి కృషి

మేడ్చల్ జిల్లా మహిళా, శిశు, దివ్యంగులు, వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలి జయంతి వేడుకలు జరిగాయి.

Update: 2025-01-04 13:29 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : మేడ్చల్ జిల్లా మహిళా, శిశు, దివ్యంగులు, వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలి జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కె.స్వర్ణలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యంగుల సంక్షేమానికి లూయిస్ బ్రెయిలి ఆదర్శమన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యలో లూయిస్ బ్రెయిలి జయంతి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారిని విజయ కుమారి, సీసీఎం సురేఖ, ఎంపీడీఓ మమతబాయి, శమీర్ పెట్ సీఐ శ్రీనాథ్​, శమీర్ పేట్ జీహెచ్ఎం డి.వేణు, సిబ్బంది పాల్గొన్నారు. 


Similar News