Crime News : అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య...

అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2025-01-06 03:35 GMT

దిశ, మేడ్చల్ టౌన్ : అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం షామీర్పేట్ మండలంలోని మజీద్పూర్ గ్రామంలో బిలాష్ కుమార్ బోయి హెచ్బీఎల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేవాడు. ఆదివారం తన రేకుల రూంలో ఎవరూ లేని సమయంలో టవల్ తో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న షామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు ఇంకా తెలియరాలేదు.


Similar News