ఆలయంలో చోరీకి పాల్పడిన బాలుడు..
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ బాలేశ్వర ఆలయంలో
దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ బాలేశ్వర ఆలయంలో మంగళవారం చోరీకి పాల్పడిన ఓ బాలుడిని స్థానికులు పట్టుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆసిఫాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు ఆలయం గేట్ కింది భాగం నుంచి లోపలికి చొరబడి చోరీకి పాల్పడుతుండగా స్థానికులు గమనించి ఆలయంలో లోపల బంధించి బాలుడు చేతులు కట్టేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. కాపల కోసం ఆలయం బయట ఉన్న మరో బాలుడు స్థానికులను చూసి సైకిల్ ఎక్కి పారిపోయినట్లు చెబుతున్నారు. కాగా పట్టుకున్న బాలుడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.