ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ... ఇద్దరికి తీవ్ర గాయాలు
బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి
దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పాల్వంచ మండలం రేగలగూడెం గ్రామానికి చెందిన పొలెబోయిన ప్రవీణ్, శాంత ద్విచక్ర వాహనంపై భద్రాచలం వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక వారపుసంత సమీపంలో మణుగూరు క్రాస్ రోడ్డు వైపునకు వెళ్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు భద్రాచలం తరలించారు. పరీక్షించిన వైద్యులు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం తరలించారు. బాధితురాలి భర్త వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.