భర్త తిట్టాడని ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ
కుటుంబ కలహాలతో ఓ మహిళ అదృశ్యమైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దిశ, దుండిగల్ : కుటుంబ కలహాలతో ఓ మహిళ అదృశ్యమైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దుండిగల్ పోలీస్ లు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎలమందయ్య, ఇస్తారమ్మ(45) భార్యా భర్తలు. భర్త కూలి పని చేస్తుండగా భార్య టీ స్టాల్ నడుపుకుంటూ గండిమైసమ్మలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఈనెల 5న భర్త మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య భోజనం పెట్టలేదన్న కోపంతో కొట్టి తిట్టాడు.
మనస్తాపానికి గురైన భార్య అదే రోజు రాత్రి 11 గంటలకు ఎవరికీ చెప్పకుండా ఇంటినుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల దగ్గర విచారించినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె కుమారుడు శేషం బెన్నీ దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.