పోక్సో కేసులో వ్యక్తి అరెస్ట్
పోక్సో కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ సైదయ్య బుధవారం తెలిపారు.
దిశ, జవహర్ నగర్ : పోక్సో కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ సైదయ్య బుధవారం తెలిపారు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీకి చెందిన షేక్ ఒమర్ (46) అదే కాలనీలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక అక్కడి నుంచి పారిపోయి వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. షేక్ ఒమర్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.