భర్త అనుమానస్పద మృతి.. న్యాయపోరాటానికి దిగిన భార్య..

ఖిలా వరంగల్ లోని పడమరకోటకి చెందిన ఎండీ హుస్సేన్, సంధ్యారాణి దంపతులు కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు.

Update: 2025-01-08 13:38 GMT

దిశ ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ లోని పడమరకోటకి చెందిన ఎండీ హుస్సేన్, సంధ్యారాణి దంపతులు కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. భర్త మూడు నెలల క్రితం తోటి కార్మికుడి ఇంటికి వెళ్లి అక్కడే సృహ తప్పి పడిపోయాడు. విషయం తెలుసుకున్న భార్య యంజీయం హాస్పిటల్ తీసుకొని వెళ్లగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని తెలిపారు. భర్త మృతి పై అనుమానంతో మృతుడి భార్య మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

కానీ పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, పోస్టుమార్టం రిపోర్ట్ తారుమారు చేసి గుండెపోటుగా చిత్రీకరిస్తూన్నారని, తన భర్త మృతికి తన తోటి పని చేసే వ్యక్తి గూడూరు శివనే కారణం అని, ఇప్పటికి అయినా పోలీసులు రీ పోస్టుమార్టం చేసి తన భర్త మృతికి గల వ్యక్తులని శిక్షించి తనకు న్యాయం చేయాలని, అప్పటి దాకా నేను న్యాయపోరాటం చేస్తూనే ఉంటానని, అనుమానితుడైన గూడూరు శివ ఇంటి ముందు ధర్నా చేస్తున్నది, దయచేసి పోలీసులు, సామజికవేత్తలు తనకు న్యాయం జరిగేలా సహాయం చేయాలి అని వేడుకుంటున్నది. ధర్నాలో బాధితురాలి కుటుంబ సభ్యులు, దళిత న్యాయకులు పాల్గొన్నారు.


Similar News