సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన గూలే శివాజీ అక్రమంగా గుడుంబా అమ్ముతూ పట్టుబడడంతో రూ. 50 వేల జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ జుల్ఫికర్ అహ్మద్ తెలిపారు.
దిశ, గుడిహత్నూర్ : మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన గూలే శివాజీ అక్రమంగా గుడుంబా అమ్ముతూ పట్టుబడడంతో రూ. 50 వేల జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ జుల్ఫికర్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ శివాజీ పలుమార్లు గుడుంబా అమ్ముతూ పట్టుబడడంతో ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేయించడం జరిగిందన్నారు. అయినా మళ్లీ గుడుంబా అమ్ముతూ బుధవారం పట్టుబడ్డాడని తెలిపారు. దాంతో యాభై వేల రూపాయల జరిమానా విధించినట్టు తెలిపారు.