మద్యం తాగొద్దు అంటే.. తనువు చాలించిన మైనర్ బాలుడు..

మద్యం తాగొద్దొని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపం చెంది చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలుడు.

Update: 2025-01-07 15:52 GMT

దిశ, తాండూరు : మద్యం తాగొద్దొని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపం చెంది చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలుడు. ఈ సంఘటన యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యాలాల్ మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన మైనర్ బాలుడు (17 )గత కొన్ని రోజులుగా మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో మద్యం సేవించొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. మద్యం మత్తులో తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, పోలీసులకు మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడి మృతి పై ఎవరిపైన అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ గిరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.


Similar News