ప్రతి పక్షాల గారడీ మాటలను తిప్పి కొట్టేందుకు కొత్త 'ఎమ్మెల్యే'లకు స్ట్రాంగ్ టిప్స్..
అసెంబ్లీలో ఎంత హుందాగా వ్యవహరించాలి. ప్రతి పక్షాల మాటల గారడీపై
దిశ,రాచకొండ : అసెంబ్లీలో ఎంత హుందాగా వ్యవహరించాలి. ప్రతి పక్షాల మాటల గారడీపై ఎలా ఎదురుదాడికి దిగాలి. ప్రజా సమస్యలను ఎలా ప్రస్తావించాలి, స్పీకర్ ను అధ్యక్షా అని మాత్రమే అనాలి, అన్న, లేదా ఇతర పదం తో సంభోదించవద్దని వివరిస్తు గచ్చిబౌలి ఎల్లా హోటల్ లో 54 మంది కొత్త ఎమ్మెల్యే లకు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. అదే విధంగా ప్రజల్లో ఎలా ఉండాలి, ఎమ్మెల్యే గా వారికి భరోసా ఎలా ఇవ్వాలి, వారితో ఎలా మాట్లాడాలి, ప్రతి పక్షాలు రెచ్చగొట్టినా చాకచక్యంగా వాటిని ఎలా తిప్పి కొట్టాలి, సోషల్ మీడియకు చిక్కకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా అనేక మెలకువలను కొత్తగా ఎన్నికైన వారికి శిక్షణ తరగతుల్లో బోధిస్తున్నారు.
ప్రభుత్వాన్ని ఇరుకున పడేసే విధంగా అసలు వ్యవహారించొద్దని చెప్పినట్లు సమాచారం.ఈ విధంగా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ లో సరికొత్త పద్దతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజల అభిమానాన్ని, విశ్వాసాన్ని గెలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు.