మాజీ ప్రధాని వాజ్ పేయి సేవలు మరువలేనివి

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు

Update: 2024-12-25 12:53 GMT

దిశ, తిరుమలగిరి : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లి చాయ్ అడ్డా వద్ద మహానేత అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1వ వార్డు బీజేపీ ప్రెసిడెంట్ శంకర్,స్టేట్ ఓబీసీ ఎగ్జిక్యూటీవ్ సభ్యులు రాయల కుమార్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన వాజ్ పేయి శతజయంతి వేడుకలకు ఎంపీ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు.

     ఆయన ప్రధానిగా దేశ ప్రజల అభ్యున్నతికి దేశ రక్షణకు నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. దేశంలోని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన అనేక సంస్కరణలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రేంకుమార్, రాకేష్, అశోక్, సంతోష్, దినేష్, శుభం, సునీత యాదవ్, ఏకాంబరం, సందీప్ పాల్గొన్నారు. 


Similar News