రెవెన్యూ సిబ్బంది పై దాడి.. కేసు నమోదు...

విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పై దాడులు జరిగిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.

Update: 2024-12-25 04:20 GMT

దిశ, జవహర్ నగర్ : విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పై దాడులు జరిగిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్ నగర్ పరిధిలోని ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న సమాచారం మేరకు కాప్రా మండల తహశీల్దార్ సుచరిత ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది సర్వే నెంబర్ 427, 428, 645, 655 లలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వెళ్లారు. దీంతో కట్టడాలను కూల్చవద్దని అడ్డుపడి సిబ్బంది పై దాడి చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేయాలని కాప్రా మండల తహశీల్దార్ సుచరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News