క్రీస్తు జీవితం ఆదర్శప్రాయం
ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన యేసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని మల్కాజి గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
దిశ,మేడ్చల్ బ్యూరో : ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన యేసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని మల్కాజి గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతల్లో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...క్రిస్మస్ వేడుకలను ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు.
శామీర్ పేటలో తన నివాసంలో.
శామీర్ పేట నివాసంలో ఆరేపల్లి రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ కేక్ కటింగ్ కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. క్రిస్టియన్ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.