Eatala Rajender: వాజ్‌పేయి.. కాంగ్రెస్‌కు సవాల్ విసిరిన ధీశాలి.. ఈటల ఆసక్తికర ట్వీట్
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి (Vajpayee) 100వ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి (Vajpayee) 100వ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) ఎక్స్ వేదికగా వాజ్‌పేయి గురించి ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘బీజేపీ సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితమైన వేళలో.. ఎప్పటికైనా దేశమంతా కాషాయ జెండా ఎగరేస్తామని కాంగ్రెస్‌కు సవాలు విసిరిన ధీశాలి అంటూ కొనియాడారు. ఆ మాటలు.. అక్షర సత్యాలు.. ఈ రోజు కమలం దేశమంతా వికసించిందన్నారు. కమల దరహాసంతో దేశం పూల దారుల్లో పరుగులు పెడుతుందన్నారు. వాజ్‌పేయి పాలనాదక్షత, దార్శనికత సదా స్మరణీయమని పేర్కొన్నారు. ఆ మహోన్నత వ్యక్తి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ అనుసరణీయం.. వారి అడుగులు స్ఫూర్తి పథం.. సదా ఆ మహాశయుని సేవలను తరిస్తూ.. పుష్పాంజలి.. అంటూ ట్వీట్ చేశారు.