మెదక్ లో అదుపులోకి అల్లర్లు.. ఇరు వర్గాల అరెస్ట్

మెదక్ పట్టణంలో జరిగిన ఇరువర్గాల అల్లర్లు అదుపులోకి వచ్చాయని, గొడవల్లో పాల్గొన్న ఇరు వర్గాలకు చెందిన వారిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ బాలస్వామి తెలిపారు.

Update: 2024-06-18 12:42 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ పట్టణంలో జరిగిన ఇరువర్గాల అల్లర్లు అదుపులోకి వచ్చాయని, గొడవల్లో పాల్గొన్న ఇరు వర్గాలకు చెందిన వారిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ బాలస్వామి తెలిపారు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ మెదక్ పట్టణంలో ఇరు వర్గాల్లో జరిగిన గొడవలు అదుపులోకి వచ్చాయని, గొడవలకు కారణమైన ఒక వర్గానికి చెందిన 16 మందిని, మరో వర్గానికి చెందిన 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని అన్నారు.

రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల కారణాంగా ఇతర జిల్లాల నుంచి పోలీస్ ఫోర్స్ తెప్పించి అంతా అదుపులోకి తెచ్చినట్టు తెలిపారు. సోషల్ మీడియా వేదిక అనగా వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్ మొదలైన వాటి ద్వారా వచ్చే ఎలాంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎవరైనా ఉద్దేశ్యపూరకంగా సోషల్ మీడియాలో కానీ మరే ఇతర రకంగా గొడవలు పెట్టాలనుకుంటే వారి పై చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గొడవలకు సంబంధించిన అన్ని వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించామని చెప్పారు. ఈ గొడవల పై సమగ్ర విచారణ జరుగుతున్నదని గొడవలకు కారణమైన ఎవరిని విడిచిపెట్టేది లేదని ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని అన్నారు.

Similar News