తాళ్లపల్లి గ్రామంలో తెల్లవారుజామున దోపిడీ

సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఈ నెల 26 తెల్లవారుజామున దొంగలు పడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తో పాటు ఓ ఇంటి ముందు పార్కు చేసి ఉంచిన కొత్త బైక్ ను చోరీ చేశారు

Update: 2024-06-26 14:55 GMT

దిశ, కంది : సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఈ నెల 26 తెల్లవారుజామున దొంగలు పడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తో పాటు ఓ ఇంటి ముందు పార్కు చేసి ఉంచిన కొత్త బైక్ ను చోరీ చేశారు. సంగారెడ్డి రూరల్ ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని తలారి భారతిబాయి ఇంట్లో నిద్రిస్తుండగా ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు దొంగలు సునాయాసంగా ఎత్తుకెళ్లారు. ఆమె పొద్దున్నే లేచి చూసే సరికి మెడలో ఉన్న పుస్తెల తాడు లేదు. ఎవరో గుర్తుతెలియని దొంగలు దొంగిలించుకుపోయారని నిర్ధారించుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది.

అలాగే అదే గ్రామంలో కిరణ్ కుమార్ ఈ మధ్యనే కొత్త యూనికాన్ బైక్ ను కొనుగోలు చేశాడు. దానికి ప్రస్తుతం టి ఆర్ నెంబర్ మాత్రమే ఉంది. ఇంటి ముందు పార్కు చేసి ఉంచిన బైకును దొంగలు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. ఈ సందర్భంగా ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎవరైనా అనుమానిత వ్యక్తులు తమ గ్రామంలో కనిపిస్తే 100 కి కాల్ చేయాలని సూచించారు. అలాగే గ్రామాల్లోని యువకులు గస్తీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.

Similar News