ఓటు హక్కు పై అవగాహన విద్యార్థి దశలో పెంపొందించుకోవాలి : ఎమ్మెల్యే

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా కీలకమైనవని, ఓటు హక్కు పై అవగాహన విద్యార్థులు పాఠశాల వయసులోనే పెంపొందించుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు.

Update: 2024-06-29 12:39 GMT

దిశ, సదాశివపేట: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా కీలకమైనవని, ఓటు హక్కు పై అవగాహన విద్యార్థులు పాఠశాల వయసులోనే పెంపొందించుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శనివారం సదాశివపేట లోని సెయింట్ ఆంటోనీ పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థులకు కేబినెట్ ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో స్టూడెంట్ క్యాబినెట్ ఎన్నుకోవడానికి ఎన్నికల ప్రక్రియను నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశ భవిష్యత్తు తరగతి గది నుండి నిర్మాణం అవుతుందని, దీనిని మనం సద్వినియోగం చేసుకొని దేశ భవిష్యత్తు కాపాడాలని సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని తెలిపారు. మీరు చదువులో రాణించి ముందు ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నారు.

భవిష్యత్తులో నిజాయితీగల నాయకులను ఎన్నుకునే అవగాహనను విద్యార్థులకు కల్పించడం పాఠశాల బాధ్యత అని ఆయన అన్నారు. స్టూడెంట్ క్యాబినెట్ లో ఎన్నికైన విద్యార్థులను ఆయన అభినందించారు. ఎన్నికలు నిర్వహణలో హెడ్ బాయిగా అఖిలేష్, హెడ్ గర్ల్ గా శివాని రెడ్డి ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్, సెయింట్ ఆంథోనిస్ విద్యాసంస్థల చైర్మన్ ఆంతోని రెడ్డి లతో కలిసి కేబినెట్లో ఎన్నికైన విద్యార్థులచే ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ సబిత, డానియల్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News