చోరీ కేసులో నిందితుల రిమాండ్.. కేసును చేదించిన పోలీసులు

చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకుని సొమ్మును రికవరీ చేసి

Update: 2024-07-01 13:14 GMT

దిశ,పాపన్నపేట : చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకుని సొమ్మును రికవరీ చేసి నిందితులను సోమవారం రిమాండ్ కు పంపినట్లు మెదక్ రూరల్ సీఐ కేశవులు మీడియా ముందు పాపన్నపేట పోలీస్ స్టేషన్ లో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల జూన్ 24న అర్ధరాత్రి సమయంలో మండల కేంద్రమైన పాపన్నపేటకు చెందిన కుకుట్ల దుర్గా ప్రసాద్ కిరాణ దుకాణంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కిరాణా దుకాణం వెనుక భాగంలో పరిశీలించగా సీసీ కెమెరాకు సంబంధించిన డివిఆర్ ను చెట్ల పొదలలో గుర్తించారు.

సీసీ కెమెరాల ఆధారాలతో పాటు ఇదే తరహాలో గతంలో చోరీకి పాల్పడిన విధానం ఆధారంగా టేక్మాల్ మండలం ఎల్లం పల్లి తాండకు చెందిన దేవసోత్ రాజు(32) అలియాస్ బుట్ట తో పాటు అదే తండాకు చెందిన దేవ సోత్ రాజు(29)లను నేరస్తులను గుర్తించారు. వీరిని సోమవారం ఎల్లంపల్లి తండాలో పట్టుకున్నట్లు వారు వెల్లడించారు. వీరి నుంచి పదిన్నర తులాల బంగారం,రూ. 14 వేల నగదు, 2 తులాల వెండిని రికవరీ చేశామని వెల్లడించారు. ఈ కేసును చేదించిన స్థానిక ఎస్సై నరేష్, సిబ్బంది దుర్గాప్రసాద్, నాన్ సింగ్, ప్రవీణ్ లను సీఐ కేశవులు అభినందించారు.

Similar News