నమ్మిన రైతును నట్టేట ముంచారు : ఎమ్మెల్యే మాణిక్ రావు

నమ్మి ఓట్లేసిన రైతాంగానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా

Update: 2024-07-03 16:22 GMT

దిశ,జహీరాబాద్: నమ్మి ఓట్లేసిన రైతాంగానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు చెల్లించకుండా నట్టేట ముంచిందని ఎమ్మెల్యే మాణిక్ రావు ఆరోపించారు. జహీరాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను చెల్లించి ఆదుకుందన్నారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. గ్రామాలు , పట్టణాల్లో శానిటేషన్, మురికి కాలువల శుభ్రత వంటి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లే ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రజలు రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం గ్రామాలలో, పట్టణంలోని వివిధ ప్రాంతాలలో కుక్కల, పందుల బెడద తీవ్రంగా నెలకొందని ఈ సమస్య నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మాజీ మున్సిపల్ చైర్మన్ తంజిమ్, జహీరాబాద్, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, నర్సింహులు , మాజీ సర్పంచ్ ప్రభు పటేల్ తదితరులు పాల్గొన్నారు.


Similar News