మహిళా శక్తి లబ్ధిదారులకు యూనిట్లు వేగవంతం చేయాలి

మహిళా శక్తి లబ్ధిదారులకు అందాల్సిన యూనిట్లు గ్రేడింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.

Update: 2024-07-05 13:15 GMT

దిశ, సంగారెడ్డి : మహిళా శక్తి లబ్ధిదారులకు అందాల్సిన యూనిట్లు గ్రేడింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశమందిరంలో గ్రామీణ మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళా సాధికారత ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడానికి మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేసి జిల్లాలోని ఆయా బ్యాంకుల నుంచి శ్రీనిధి ద్వారా మహిళా శక్తి యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా నిర్వహించాలన్నారు. వివిధ రకాలైన ఈవెంట్ మేనేజ్మెంట్, మైక్రో ఎంటర్ప్రైజెస్, వ్యవసాయ పనిముట్లు, పాడిపరిశ్రమ,

    కోళ్ల పెంపకం, మహిళా క్యాంటీన్ తదితర 13 రకాల యూనిట్ల ద్వారా మహిళలకు మంచి ఆర్థికాభివృద్ధి సాధిస్తారన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి మహిళా సంఘాలు ఇతర అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంతో సబ్సిడీ పథకాలు విరివిగా ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంబంధించిన అధికారులు నెల వారిగా టార్గెట్ పూర్తి చేయాలని, అందుకోసం బ్యాంకర్లు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకోసం జిల్లా ఎల్డీఎం ప్రత్యేక చొరువ తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి ఎం.జ్యోతి, అదనపు డీఆర్డీఓ జంగారెడ్డి, డీపీఎంలు, ఏపీఎంలు ఇతర జిల్లా అధికారులు, జిల్లా సమైక్య, మండల సమైక్య అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


Similar News