జలదిగ్బంధంలో ఏడుపాయల అమ్మవారి ఆలయం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీర నది ఏడుగా చీలిన పాయల్లో ఆలయం ఉండటంతో.. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి మంజీర నదికి వరద పోటెత్తి, ఆలయం వరద నీటిలో చిక్కుకుపోవడం పరిపాటి. అయితే ప్రస్తుతం దసరా వేడుకలలో భాగంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగాల్సి ఉండగా.. వరదనీరు అడ్డంకిగా మారింది. దీంతో గర్భగుడి మూసివేసి రాజగోపురంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. కాగా నేడు గాయత్రీదేవి అలంకారంలో ఏడుపాయల అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.