రాజ్యాంగం ద్వారానే బానిస బతుకులకు విముక్తి : బక్కి వెంకటయ్య

భారత రాజ్యాంగం ద్వారా బానిస బతుకులకు విముక్తి కలిగినదని అటువంటి రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను తిప్పికొట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.

Update: 2024-11-24 15:36 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : భారత రాజ్యాంగం ద్వారా బానిస బతుకులకు విముక్తి కలిగినదని అటువంటి రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను తిప్పికొట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) మెదక్ జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో 75 ఏళ్ల భారత రాజ్యాంగ ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై మాట్లాడుతూ… కుల వివక్ష, నేరాలకు భారత రాజ్యాంగం శిక్షలు వేస్తుందన్నారు. దేశానికి దక్షిణ భారతదేశంలో రెండవ రాజధాని ఉండాలని బాబాసాహెబ్ ముందు చూపుతో ప్రతిపాదన బాబాసాహెబ్ ముందు చూపు కు నిదర్శనమన్నారు. బోధించు, సమికరించు పోరాడు బానిస సంకెళ్ళ నుండి విముక్తి పొందాలన్నారు.

హైకోర్టు న్యాయవాది పొన్నం దేవరాజ్ గౌడ్, మాట్లాడుతూ… మను అధర్మ శాస్త్రం రాజ్యాంగం గా చలామణి అయి బహుజనులను చదువుకు, ఉద్యోగాలకు,రాజకీయ అధికారం,సంపద లేకుండా చేసిందన్నారు. తోటి మనిషిని మనిషిగా చూడ నిరాకరించిందన్నారు. డాక్టర్ బి అర్ .అంబేద్క ర్ అందించిన భారత రాజ్యాంగం వల్ల విద్య,ఉద్యోగాలు ,సంపద లు వచ్చాయన్నారు. టిఎన్ జి ఓ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్, మాట్లాడుతూ భారత నేటికి కుల,మత వివక్షలు కొనసాగుతున్నాయన్నారు. నిద్రలో వున్న బిసిలు మెల్కోని రాజకీయ అధికారాన్ని సాధించుకొవాలన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత బిసి ల కుల గణన జరగలేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కులగణన ద్వారా మనమెంత మందిమొ జనాభా లెక్కలు బయటకు వస్తాయన్నారు.బీసీలకు విద్య,ఉద్యోగాలలో మాత్రమే రిజర్వేషన్ లు అమలవుతున్నాయని చట్ట సభలలో రిజర్వేషన్ లు లేవన్నారు.

ఇడబ్లు ఎస్ రిజర్వేషన్ పేరుతో అధిపత్య కులాలు ఎస్సీ ఎస్టీ, బిసి ల ఉద్యోగాలను దొచుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందన్నారు. భారత రాజ్యాంగం వెలుగులో సమసమాజ నిర్మాణానికి పునాదులు వేయాలన్నారు.డి బిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాట్లాడుతూ స్వేచ్ఛ,సమానత్వం సోదరభావం ,సామాజిక,ఆర్థిక,రాజకీయ న్యాయన్ని భారత రాజ్యాంగం అందించిందన్నారు. కొట్లాది మంది అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన 75 ఏళ్ల భారత రాజ్యాంగ ఉత్సవాన్ని పండుగుల నిర్వహించాలన్నారు.రాజ్యాంగ దినోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

జిల్లా సుధాకర్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాంస్య విగ్రహం కమిటీ అధ్యక్షులు గంగాధర్, బహుజన నాయకులు రాచకొండ వెంకన్న,గౌడ సంఘం నాయకులు బాల్ రాజ్ గౌడ్,తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ పద్మావతి, గిరిజన గురుకుల విద్యాలయం ఉపాధ్యాయయరాలు అర్చన కులకర్ణ,డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజివ్,జిల్లా కార్యదర్శి దయా సాగర్,వివిధ సంఘాల నేతలు అహ్మద్,బ్యాగరి వేణు,గరుగుల శ్రీనివాస్,న్యాయవాది సిద్దిరాములు విశ్రాంత ఉపాధ్యాయులు రాధకిషన్,మానయ్య,కుంట బాల్ రాజు,నాగరాజు,నాంపల్లి,బొట్టు నర్సింగ్ రావు,నిజాంపేట మాజీ ఉప సర్పంచ్ బాబు,నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సభ ప్రారంభానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.అర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించారు. ఎస్టీ గురుకుల విద్యార్ధినిలు సానియా,శ్రీ లత లు రాజ్యాంగ పిఠికను ప్రతిజ్ఞ చేయించారు.ఎస్సీ గురుకుల విద్యార్ధిని భార్గవి వార్తలు చదివారు. రాజ్యాంగం పై నిర్వహించిన వ్యాస ,క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.మెదక్ జిల్లా కేంద్రం లో అంబేద్కర్ భవనానికి ఎకరం స్థలం కేటాయించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు జెల్ల సుధాకర్, గంగన్న,నరేందర్,బొందుగుల నాగరాజు లు వినతి పత్రం సమర్పించారు. కళాకారుడు మధు అంబేద్కర్ ను స్మరిస్తూ పాటలు పాడారు.


Similar News