ఈనెల 28 నుంచి 30 వరకు సైన్స్ ఫెయిర్

జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, 2024-25 ఇన్ స్పైర్ అవార్డుల ప్రాజెక్టుల ప్రదర్శన ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్య అధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Update: 2024-11-24 10:39 GMT

దిశ, సిద్దిపేట అర్బన్ : జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, 2024-25 ఇన్ స్పైర్ అవార్డుల ప్రాజెక్టుల ప్రదర్శన ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్య అధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఎంఈవోలు, ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నేపథ్యంలో మండల విద్యాశాఖ అధికారులను కన్వీనర్లుగా, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను కో కన్వీనర్లుగా నియమించినట్లు తెలిపారు. ఇన్ స్పైర్ అవార్డులకు గాను ఎంపికైన 188 మంది విద్యార్థులు గత సంవత్సరం నామినేషన్ చేసుకున్న అంశాల్లో ఎటువంటి మార్పు లేకుండా తమ ప్రదర్శనలతో తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనకు అన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అంశాల నమూనాలతో హాజరుకావాలని అన్నారు. మరింత సమాచారం కోసం జిల్లా సైన్స్ అధికారి కల్లేపల్లి శ్రీనివాస్ ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


Similar News