హైదరాబాద్‌కు గోదావరి జలాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) మహానగర భవిష్యత్ తాగునీటి(Drinking Water) ఇబ్బందులు తీర్చడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-11-24 03:34 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) మహానగర భవిష్యత్ తాగునీటి(Drinking Water) ఇబ్బందులు తీర్చడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాజధాని తాగునీటి అవసరాల కోసం గోదావరి మొదటి దశ ఎల్లంపల్లి ప్రాజెక్టు(Ellampally project) నుంచి ఏటా 10 టీఎంసీల (163 మిలియన్ గ్యాలన్స్ ఫర్ డే) నీరు సరఫరా చేస్తుండగా.. తాజాగా కొండ పోచమ్మసాగర్(Konda Pochamma Sagar), మల్లన్నసాగర్ (Mallannasagar)నుంచి రెండవ దశ గోదావరి జలాలు(Godavari water) తరలింపుపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే సిద్దిపేట జిల్లా(Siddipet District)లోని రెండు ప్రాజెక్టుల నుంచి మరో ఏటా 20 టీఎంసీల గోదావరి జలాలు రాజధాని వాసుల దాహార్తిని తీర్చనున్నాయి. గోదావరి తొలిదశ ప్రాజెక్టు కింద నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జల మండలి(Water Board)కి ఇప్పటికే ఏటా 10 టీఎంసీల నీరు తరలిస్తున్నారు. తాజాగా రెండో దశ పనుల ద్వారా 50 టీఎంసీల సామర్ధ్యం కలిగిన మల్లన్న సాగర్, 15 టీఎంసీల సామర్ధ్యం కలిగిన కొండ పోచమ్మ సాగర్ ద్వారా ఏటా 20 టీఎంసీల నీటిని తరలించనున్నారు. ఇందులో తాగునీటి అవసరాలకు.. మిగిలిన నీరు మహానగర జలాశయాల పునర్జీవనం, మూసీ ప్రక్షాళన కోసం వినియోగిస్తారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నారు.

రాజధానికి నీటి తరలింపు ఇలా..?

హైదరాబాద్ తాగునీటి అవసరాలు 2030 నాటికి 750 ఎంఎల్‌డీలకు పెరుగుతాయని అంచనాల నేపథ్యంలో గోదావరి అదనపు జలాల సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మంగోలు ట్రీట్ మెంట్ ప్లాంట్(Mongolu Treatment Plant) నుంచి కొండపాక(Kondapaka) హెచ్ఎండబ్యూ(HMW) పంప్ హౌజ్ లోకి ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అదే విధంగా కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు శామీర్ పేట(Shamirpet)కు అక్కడి జంట నగరాలకు తాగు నీటి అవసరాలకు, మహానగర జలాశయాల పునరుజ్జీవనం, మూసీ(Moosi) ప్రక్షాళనకు గోదావరి జలాలను తరలించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. పాత నెట్ వర్క్ వినియోగించుకోవడంతో పాటుగా, కొత్త ప్రతిపాదనల ద్వారా ప్రతి రోజు 100 ఎంఎల్ డీ నీటిని హైదరాబాద్ కు తరలించే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సంబంధిత శాఖల అధికార వర్గాలు వెల్లడిస్తున్నారు.

సిద్దిపేట, గజ్వేల్, జనగామ నియోజక వర్గాలకు..

మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను మంగోలు ట్రీట్ మెంట్ ప్లాంట్ లో శుద్ది చేసిన జలాలను సిద్దిపేట మున్సిపాలిటీతో పాటుగా, గజ్వేల్, జనగామ నియోజక వర్గాల్లో తాగునీటి అవసరాల కోసం ప్రతి రోజు 130 ఎంఎల్ డీ ( మిలియన్ లీటర్స్ ఫర్ డే) సరఫరా చేస్తున్నారు.

Tags:    

Similar News